Viral Videos: జూ కీపర్ అత్యుత్సాహం! వేలు కొరికేసిన మృగరాజు
కొన్నిసార్లు సరదాగా చేసే పనులు.. ప్రాణాల మీదికి తెచ్చిపెడుతుంటాయి. ఇలాంటి ఓ ఘటనే జమైకాలోని ఓ జంతుప్రదర్శనశాలలో చోటుచేసుకుంది. ఓ జూ కీపర్ అత్యుత్సాహంతో కంచె లోపలికి తన చేతిని దూర్చి సింహాన్ని ఆటపట్టిస్తుండగా...
ఇంటర్నెట్ డెస్క్: కొన్నిసార్లు సరదాగా చేసే పనులు.. ప్రాణాల మీదికి తెచ్చిపెడుతుంటాయి. ఇలాంటి ఓ ఘటనే జమైకాలోని ఓ జంతుప్రదర్శనశాలలో చోటుచేసుకుంది. ఇక్కడి జూ కీపర్ అత్యుత్సాహంతో కంచె లోపలికి తన చేతిని దూర్చి సింహాన్ని ఆటపట్టిస్తుండగా.. ఒక్కసారిగా ఆ మృగం అతని చేతివేళ్లను నోటకరచుకుంది. ఎంత గింజుకున్నా విడవకపోవడంతో.. చివరకు అతను ఉంగరపు వేలిని పూర్తిగా కోల్పోయాడు. గగుర్పొడిచేలా ఉన్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్‌గా మారింది. సింహం తన వేళ్లను పట్టున్నప్పుడు అతను చేతిని వెనక్కి లాగడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
అయితే, ఈ ఘటన జరిగినప్పుడు.. మొదటగా దీన్నొక జోక్‌గా భావించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎప్పుడైతే ఆ వ్యక్తి నేలపై పడిపోయాడో అప్పుడు పరిస్థితి తీవ్రత అర్థమైనట్లు చెప్పారు. జూ యాజమాన్యం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధితుడిని ఆదుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నిరోధించేందుకుగానూ ఈ ఘటనపై విచారణ చేపడతామని ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు.. ‘జూ’లో సింహాల సంరక్షణ, వాటి పట్ల సిబ్బంది ప్రవర్తన విషయంలో జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయనున్నట్లు.. ‘జమైకా సొసైటీ ఫర్ ది ప్రివెన్షనల్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్’ ఎండీ పమేలా లాసన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్‌పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్