Biometric‌ సమస్యలతో దూరం చెయ్యొద్దు

మహమ్మారి కాలంలో లబ్ధిదారులు ఆహార ధాన్యాలకు దూరం కావొద్దని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) అభిప్రాయపడింది.

Updated : 20 May 2021 09:58 IST

రేషన్‌పై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం

ఈనాడు, దిల్లీ: మహమ్మారి కాలంలో లబ్ధిదారులు ఆహార ధాన్యాలకు దూరం కావొద్దని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) అభిప్రాయపడింది. ఆధార్, రేషన్‌ కార్డులను బయోమెట్రిక్‌తో అనుసంధానించే ప్రక్రియలో సమస్యలతో దేశంలో 30.8 కోట్ల మంది ఆహార ధాన్యాలకు దూరం కాకుండా చూడాలంటూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. బయోమెట్రిక్‌ సమస్యలతో మిజోరాంలోని ఛక్మా గ్రామ ప్రజలు ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద ఆహార ధాన్యలు పొందలేకపోతున్నారని రైట్స్‌ అండ్‌ రిస్క్‌స్‌ అనాలసిస్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ సుహాస్‌ ఛక్మా ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ కరోనా కాలంలో సాంకేతిక కారణాలతో లబ్ధిదారులు ఆహార ధాన్యాలకు దూరం కాకుండా చూడాలని   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని