దిల్లీలో అక్టోబర్‌ 31వరకు పాఠశాలలు మూత!

దేశరాజధాని దిల్లీలో అక్టోబర్‌ 31 వరకు పాఠశాలలు మూసివేసే ఉంటాయని దిల్లీ ఉపముఖ్యంత్రి మనీష్ సిసోడియా వెల్లడించారు.

Published : 04 Oct 2020 23:01 IST

దిల్లీ: దేశరాజధాని దిల్లీలో అక్టోబర్‌ 31 వరకు పాఠశాలలు మూసివేసే ఉంటాయని దిల్లీ ఉపముఖ్యంత్రి మనీష్ సిసోడియా వెల్లడించారు. కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ నెల 31 వరకు మూసివుంచాలనే నిర్ణయానికి వచ్చామన్నారు. ఇప్పటికే 9 నుంచి 12తరగతి విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే, విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎక్కువగా ఆన్‌లైన్‌ తరగతులకే మొగ్గు చూపుతున్నారని అధికారులు పేర్కొన్నారు. అక్టోబర్‌ 5నుంచి పాఠశాలలు తెరుస్తామని దిల్లీ ప్రభుత్వం ఇంతకు ముందు ప్రకటించింది. తాజాగా దీన్ని 31వరకు పొడగించింది.

వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో మార్చి 16నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలలు మూసివేసిన విషయం తెలిసిందే. తాజాగా అన్‌లాక్‌ 5.0 లోభాగంగా అక్టోబర్‌ 15నుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. వైరస్‌ తీవ్రత కొనసాగుతున్న దృష్ట్యా అక్టోబర్‌ 31వరకు పాఠశాలలు మూసివేతకే దిల్లీ ప్రభుత్వం మొగ్గుచూపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని