క్వారంటైన్‌లోకి డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలిన వ్యక్తితో ఇటీవల తాను కలిసినట్లు స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. అయితే, తనకు ఎలాంటి లక్షణాలు లేవన్నారు...........

Updated : 29 Jun 2023 16:52 IST

జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. తాజాగా కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలిన వ్యక్తిని ఇటీవల తాను కలిసినట్లు స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. అయితే, తనకు ఎలాంటి లక్షణాలు లేవన్నారు. డబ్ల్యూహెచ్‌వో నిబంధనల ప్రకారం.. కొన్ని రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నట్లు తెలిపారు. అప్పటి వరకు ఇంటి నుంచే పనిచేస్తానని చెప్పారు.

కొవిడ్‌-19 కట్టడి కోసం టెడ్రోస్‌ నేతృత్వంలో డబ్ల్యూహెచ్‌వో విశేష కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇటు మహమ్మారి కట్టడితో పాటు వ్యాక్సిన్‌ అభివృద్ధిపై వివిధ దేశాల మధ్య సంబంధాల్ని సమన్వయపరుస్తోంది. పేద దేశాలకు సమానంగా వ్యాక్సిన్‌, ఔషధాలు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని