AAP: చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక.. భాజపా కుట్ర బయటపడిందన్న ఆప్‌

Chandigarh mayoral Poll: చండీగఢ్‌ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆప్‌(AAP) స్వాగతించింది. 

Published : 20 Feb 2024 18:01 IST

దిల్లీ: చండీగఢ్‌ మేయర్ ఎన్నిక చెల్లదని, ఆప్‌ అభ్యర్థే విజేత అని మంగళవారం సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీనిపై ఆప్(AAP) హర్షం వ్యక్తం చేసింది. ‘సుప్రీంకోర్టు((Supreme Court)లో భాజపా కుట్ర బయటపడింది. అంత చిన్న ఎన్నికలోనే కేంద్ర ప్రభుత్వం, భాజపా ఈ తీరుగా వ్యవహరించడం.. చాలా తీవ్రమైన విషయం’ అని ఆందోళన వ్యక్తంచేసింది. క్లిష్ట సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడిందంటూ ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. (Chandigarh mayoral Poll)

చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌పై నేడు మరోసారి సుప్రీంకోర్టులో విచారణ జరగ్గా ఆ ఎన్నిక చెల్లదంటూ సంచలన తీర్పు వెల్లడించింది. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసేందుకు ఉద్దేశపూర్వంగా వ్యవహరించారని స్పష్టంగా తెలుస్తోందని కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈసందర్భంగా రిటర్నింగ్ అధికారి కొట్టివేత గుర్తు పెట్టిన బ్యాలెట్ పేపర్లను పరిశీలించింది. అలాగే లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన వీడియోను మరోసారి వీక్షించారు.

జనవరి 30న నిర్వహించిన చండీగఢ్ మేయర్ ఎన్నికలో తగినంత సంఖ్యా బలం(16) లేకపోయినా భాజపా మేయర్‌ అభ్యర్థి మనోజ్‌ సోంకర్‌ అనూహ్య విజయం సాధించారు. మెజారిటీకి అవసరమైన కౌన్సిలర్ల బలం(20) ఉన్నప్పటికీ ఆప్‌-కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థి కుల్దీప్‌ కుమార్‌ ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో పట్టపగలే మోసం జరిగిందంటూ ఆప్‌ కౌన్సిలర్ ఒకరు సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు