
Biden: ‘తీవ్ర పరిణామాలు తప్పవు’.. పుతిన్‌ను హెచ్చరించిన బైడెన్ !
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా-రష్యాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శనివారం మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌ను ఆక్రమించేందుకు రష్యా యత్నిస్తే భారీ మూల్యం చెల్లించేలా ఆర్థిక ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఉక్రెయిన్ రక్షణ కోసం అమెరికా పదాతి దళాలను పంపించే ప్రతిపాదన ఏమీ లేదన్నారు. నాటో దేశాల్లోని తూర్పు సరిహద్దుల రక్షణ కోసం అదనపు బలగాలను పంపాల్సి ఉందన్నారు. ‘‘నేను ఈ విషయాన్ని పుతిన్‌కు స్పష్టంగా వెల్లడించాలనుకున్నాను. ఒక వేళ ఉక్రెయిన్‌పైకి రష్యా దళాలు వెళితే.. ఆతర్వాత భయంకరమైన ఆర్థిక ఆంక్షలు ఖాయం’’ అని వ్యాఖ్యానించారు.
గత వారం పుతిన్-బైడెన్ దాదాపు రెండు గంటలపాటు ఫోన్‌కాల్‌లో మాట్లాడుకొన్నారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ ఉక్రెయిన్‌పై దాడి చేస్తే ప్రపంచం అనూహ్యంగా మారిపోతుందని హెచ్చరించారు. శనివారం జీ-7 విదేశాంగ మంత్రులు కూడా ఇటువంటి హెచ్చరికనే జారీ చేశారు. వీరు నిన్న లివర్‌పూల్‌లో సమావేశమైన విషయం తెలిసిందే. రేపు జీ-7 దేశాల ఆర్థిక మంత్రులు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రష్యాపై ఆంక్షల విషయాన్ని కూడా చర్చించనున్నారు.
► Read latest National - International News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.