BS Yediyurappa: హెలిప్యాడ్‌పై ప్లాస్టిక్.. యడియూరప్ప హెలికాప్టర్‌కు తప్పిన ముప్పు
యడియూరప్ప (BS Yediyurappa) ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు ల్యాండింగ్ సమస్య ఎదురైంది. చెత్త, ప్లాస్టిక్ షీట్ల కారణంగా హెలికాప్టర్ కొంతసేపు గాల్లో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటక (Karnataka) మాజీ ముఖ్యమంత్రి, భాజపా (BJP) సీనియర్ నేత బి.ఎస్. యడియూరప్ప (BS Yediyurappa)కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దిగాల్సిన హెలిప్యాడ్‌పై ప్లాస్టిక్ పేరుకుపోవడంతో.. చివరి నిమిషంలో పైలట్ ల్యాండింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో ప్రమాదం తప్పింది. అసలేం జరిగిందంటే..
ఈ ఉదయం యడియూరప్ప (BS Yediyurappa), మరికొంతమంది భాజపా (BJP) నేతలతో కలిసి కలబుర్గి వెళ్లారు. జెవార్గి ప్రాంతంలో వీరి హెలికాప్టర్‌ను దించేందుకు స్థానిక అధికారులు హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అయితే ఆ హెలిప్యాడ్‌పై చెత్తాచెదారం, ప్లాస్టిక్ (Plastic) షీట్లు పేరుకుపోయాయి. హెలికాప్టర్ (Helicopter) ల్యాండ్ అయ్యేందుకు కిందకు రాగానే అవన్నీ ఒక్కసారిగా పైకి ఎగిరి ల్యాండింగ్‌కు ఇబ్బందిగా మారాయి. దీంతో పైలట్ చివరి నిమిషంలో ల్యాండింగ్‌ను రద్దు చేసుకోవడంతో హెలికాప్టర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఆ తర్వాత స్థానిక యంత్రాంగం హెలిప్యాడ్ (Helipad)ను శుభ్రం చేసి ల్యాండింగ్‌కు వీలు కల్పించారు. అప్పటిదాకా హెలికాప్టర్ అక్కడే గాల్లో చక్కర్లు కొట్టింది. కొంతసేపటి తర్వాత అదే హెలిప్యాడ్‌పై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
AP Highc court: కాపు రిజర్వేషన్లపై కౌంటర్ దాఖలు చేయండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
-
Sports News
Virat - ABD: తొలినాళ్లలో విరాట్‌ను అలా అనుకున్నా: ఏబీ డివిలియర్స్
-
Politics News
YS Sharmila: వైతెపా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట.. కిందపడిపోయిన వైఎస్ షర్మిల
-
India News
Rahul Gandhi: ఆ బంగ్లాలో ఎన్నో జ్ఞాపకాలున్నాయి: లోక్‌సభ సెక్రటేరియట్‌కు రాహుల్ రిప్లయ్
-
Movies News
Nagababu: రామ్ చరణ్‌కు ఒక సక్సెస్ దూరం చేశాననే బాధ ఇప్పుడు తీరిపోయింది: నాగబాబు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు