Ayushman Bharat: ‘ఆయుష్మాన్‌ భారత్‌’ ఆరోగ్య కేంద్రాల పేరు మార్పు

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాల పేరును మార్పు చేశారు.

Updated : 26 Nov 2023 19:36 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ప్రధానమంత్రి ఆరోగ్య యోజన- ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య కేంద్రాల పేరులో మార్పు చోటుచేసుకుంది. ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లను ‘ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌’గా మార్చాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసినట్లు అధికారిక వర్గాలు ఆదివారం తెలిపాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పేరు మార్చిన తర్వాత ఆ ఫొటోలను ఆయుష్మాన్ భారత్-హెల్త్ అండ్ వెల్‌నెస్‌ సెంటర్స్‌(AB-HWC) పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించినట్లు తెలిపారు. 

జాతీయ ఆరోగ్య విధానంలో భాగంగా 2018 సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమా పథకం. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రతి కుటుంబానికి రూ.5లక్షల వరకు వైద్యం అందించేందుకు ఉద్దేశించింది. దేశంలోని 50 కోట్ల మందికి 1393 రకాలైన వ్యాధులకు చికిత్స పొందేందుకు అవకాశం కల్పించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని