Dawood Ibrahim: వేలానికి దావూద్‌ ఇబ్రహీం చిన్ననాటి ఇల్లు..!

మోస్ట్‌వాంటెడ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం (Dawood Ibrahim)కు చెందిన ఆస్తులను శుక్రవారం వేలం వేయనున్నారు. 

Updated : 02 Jan 2024 12:36 IST

దిల్లీ: ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి, భారత మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది దావూద్‌ ఇబ్రహీం (Dawood Ibrahim) చిన్ననాటి ఇంటిని వేలం వేయనున్నారు. దీంతో పాటు అతడి కుటుంబానికి చెందిన మరికొన్ని ఆస్తుల్ని కూడా ఈ వేలం ప్రక్రియలో ఉంచారు. మహారాష్ట్ర (Maharashtra)లోని రత్నగిరి పరిధిలో ఉన్న ముంబాకే గ్రామంలో శుక్రవారం ఈ వేలం జరగనుందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఇప్పటికే దర్యాప్తు సంస్థలు ఈ ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. వీటిని జనవరి 5న ముంబయి(Mumbai)లో వేలం వేయనున్నట్లు సమాచారం. గత 9 ఏళ్లలో దావూద్ కుటుంబానికి చెందిన రెస్టారెంట్‌, ఫ్లాట్స్‌, గెస్ట్‌ హౌస్‌ సహా 11 ఆస్తుల్ని వేలం వేసి సుమారు రూ.12 కోట్లు సమీకరించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.

‘దావూద్‌ ఇబ్రహీం.. అనేకసార్లు ‘చచ్చిన’ మోస్ట్‌వాంటెడ్‌!’

దావూద్‌ ఇబ్రహీం 1980ల్లోనే పాకిస్థాన్‌కు (Pakistan) పారిపోయాడు. 1993లో జరిగిన ముంబయి వరుస పేలుళ్లకు ప్రధాన సూత్రధారిగా వ్యహరించాడు. అమెరికాతోపాటు, ఐక్యరాజ్యసమితి కూడా అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఐరాస జాబితాలో అతడి చిరునామా కరాచీలో ఉన్నట్లు పేర్కొంది. అయితే, అతడు తమ దేశంలో తలదాచుకున్న విషయాన్ని చెప్పడానికి పాక్‌ వెనకాడుతూనే ఉంది. ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే లిస్టు నుంచి బయటపడేందుకు తప్పని పరిస్థితుల్లో (2020లో) ఒకసారి మాత్రం అంగీకరించినట్లు సమాచారం.

ఇటీవల దావూద్ చనిపోయాడనే వార్తలు వినిపించాయి. ఈ అంతర్జాతీయ ఉగ్రవాదిపై విషప్రయోగం జరిగిందని, కరాచీలో ఓ ఆసుపత్రిలో చేరాడని కథనాలు వెలువడ్డాయి. అయితే వీటిపై ఎలాంటి ధ్రువీకరణ లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని