Delhi excise case: సిసోదియాకు షాక్‌.. ఆస్తులు అటాచ్‌ చేసిన ఈడీ

దిల్లీ మద్యం కేసులో ఆప్‌ నేత మనీశ్‌ సిసోదియాకు మరో షాక్‌ తగిలింది. తాజాగా ఆయన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది.

Published : 07 Jul 2023 23:22 IST

దిల్లీ: దిల్లీ మద్యం కేసు(Delhi excise case)లో అరెస్టయిన ఆప్‌ కీలక నేత, దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోదియా(Manish sisodia) సహా పలువురి ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది.  సిసోదియాతో పాటు ఆయన సతీమణి, ఇతర నిందితులకు చెందిన రూ.52 కోట్లకు పైగా ఆస్తుల్ని అటాచ్‌ చేసినట్టు ప్రకటించింది. దిల్లీ మద్యం విధానానికి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో ఈ ఆస్తులను అటాచ్‌ చేసినట్టు ఈడీ వెల్లడించింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద సిసోదియా, ఆయన సతీమణి సీమా సిసోదియాకు చెందిన రెండు స్థిరాస్తులతో పాటు మరో ఇద్దరు నిందితులైన రాజేశ్ జోషీ (ఛారియట్‌ ప్రొడెక్షన్స్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌)కు చెందిన భూమి/ఫ్లాట్‌;  అలాగే, గౌతమ్‌ మల్హోత్రాకు చెందిన భూమి/ ఫ్లాట్‌ మొత్తంగా రూ.7.29కోట్ల స్థిరాస్తుల్ని అటాచ్‌ చేసినట్టు  ప్రొవిజినల్‌ ఆర్డర్‌లో పేర్కొంది. 

అలాగే, మనీశ్ సిసోదియా బ్యాంకు బ్యాలెన్సు రూ.11.49లక్షలు, బ్రిండ్కో సేల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (రూ.16.45కోట్లు) ఆస్తులతో పాటు ఈ కేసులో ఇతరులకు సంబంధించి రూ.44.29 కోట్ల విలువైన చరాస్తులను  అటాచ్‌ చేసినట్టు ఈడీ తెలిపింది. అటాచ్‌ చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.52.24కోట్లుగా ఉన్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది.  మద్యం కుంభకోణం కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియాను మార్చిలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని