Pfizer: ఫైజర్‌ బూస్టర్‌ డోసుకు ఈయూ రెగ్యులేటరీ ఓకే!

కరోనా నివారణకు 18 ఏళ్లు పైబడిన వారికి ఫైజర్‌ టీకా బూస్టర్‌ డోసు ఇచ్చేందుకు యూరోపియన్‌ యూనియన్‌ డ్రగ్‌ రెగ్యులేటరీ పచ్చజెండా......

Published : 04 Oct 2021 22:39 IST

అమ్‌స్టర్‌డామ్‌: కరోనా నివారణకు 18 ఏళ్లు పైబడిన వారికి ఫైజెర్‌ టీకా బూస్టర్‌ డోసు ఇచ్చేందుకు యూరోపియన్‌ యూనియన్‌ డ్రగ్‌ రెగ్యులేటరీ పచ్చజెండా ఊపింది. నిర్దేశించిన వయసు కలిగిన వారంతా రెండో డోసు తీసుకున్న కనీసం 6 నెలలు తర్వాత బూస్టర్‌ డోసు తీసుకోవచ్చని యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ తెలిపింది. రోగ నిరోధకత మరీ తక్కువగా ఉన్నవారు ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ లేదా మోడెర్నా టీకాలను రెండో డోసు తీసుకున్న కనీసం 28 రోజుల తర్వాత మూడో డోసు వేసుకోవచ్చని సిఫారసు చేసింది. ఈ సిఫారసులు ఈయూలో ఉన్న 27 సభ్య దేశాలకు వెళ్లనున్నాయి. అయితే, ఇప్పటికే పలు దేశాలు బూస్టర్‌ డోసు పంపిణీని ప్రారంభించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని