Fire Accident: ముంబయిలో ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం

Fire Accident In Mumbai: ముంబయిలోని గోరేగావ్‌ ప్రాంతంలో ఓ ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు.

Updated : 06 Oct 2023 13:25 IST

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయి (Mumbai)లో ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. గోరేగావ్‌ ప్రాంతంలో ఓ బహుళ అంతస్తుల నివాస భవనంలో మంటలు చెలరేగి ఏడుగురు సజీవ దహనమయ్యారు. మరో 40 మందికి పైగా గాయపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

ఈ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో స్థానిక ఉన్నత్‌ నగర్‌లోని ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. చూస్తుండానే భవనమంతా వ్యాపించాయి. సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపుచేశారు.

బాలీవుడ్‌ చుట్టూ ‘బెట్టింగ్‌ యాప్‌’ ఉచ్చు.. నటి శ్రద్ధా కపూర్‌కు ఈడీ సమన్లు

ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఇద్దరు చిన్నారులున్నారు. మరో 40 మందికి పైగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

ప్రధాని దిగ్భ్రాంతి..

ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రుల చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని