‘జనాల్లేకుండానే జగన్నాథ యాత్ర’

భారత్‌లో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక పూరీ జగన్నాథ రథయాత్రను ప్రజల్లేకుండా జరిపేందుకు అనుమతించాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. కరోనా నేపథ్యంలో రథయాత్ర నిర్వహణపై ఇచ్చిన స్టేను సవరించాలంటూ దాఖలైన పిటిషన్లపై నేడు సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.......

Published : 22 Jun 2020 14:15 IST

నిర్వహణకు అనుమతించాలని సుప్రీంకు కేంద్రం వినతి

దిల్లీ: భారత్‌లో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక పూరీ జగన్నాథ రథయాత్రను ప్రజల్లేకుండా జరిపేందుకు అనుమతించాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. కరోనా నేపథ్యంలో రథయాత్ర నిర్వహణపై ఇచ్చిన స్టేను సవరించాలంటూ దాఖలైన పిటిషన్లపై నేడు సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కేంద్రం వాదనకు ఒడిశా ప్రభుత్వం సైతం మద్దతుగా నిలిచింది. దీంతో దీనిపై స్పందించిన సుప్రీం.. ఈ అంశంపై లోతైన విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

కేంద్ర తరఫున సొలిసిటర్‌ జనరల్ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. ఈ వేడుక ప్రజల విశ్వాసానికి సంబంధించినదని కోర్టుకు వివరించారు. జూన్‌ 23న వేడుక నిర్వహించలేకపోతే.. సంప్రదాయం ప్రకారం మరో 12 ఏళ్ల పాటు రథయాత్రను వాయిదా వేయాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని వివరించారు. అవసరమైతే ఒకరోజు పాటు కర్ఫ్యూ కూడా విధించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అనాదిగా వేడుక నిర్వహణలో భాగం అవుతున్న కుటుంబాలకు చెందిన 600 మంది సేవకులు మాత్రమే యాత్ర నిర్వహణను చూసుకుంటారని వివరించారు. 

కరోనా వల్ల పూరీ జగన్నాథ రథయాత్ర నిలిపివేయాలని సుప్రీం జూన్‌ 18న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో లక్షలమంది తరలివచ్చే అవకాశమున్నందున రథయాత్ర సబబు కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. మంగళవారం నుంచి జగన్నాథ రథయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా.. సుప్రీంకోర్టు ఆదేశాలతో సందిగ్ధత నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని