9/11లో త‌ప్పించుకున్నాడు..కానీ క‌రోనా నుంచి?

2001లో వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్ కుప్ప‌కూలుతున్న స‌మ‌యంలో తీసిన కొన్ని ఫోటోలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విశేషంగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. భారీ జంట భ‌వ‌నాల శిథిలాల‌నుంచి తప్పించుకునేందుకు అక్క‌డి ప్ర‌జ‌లు ప్రాణాల‌ను అర‌చేతిలో పెట్టుకొని ప‌రుగులు తీశారు. వీరిలో న్యూయార్క్‌కు చెందిన స్టీఫెన్ కూప‌ర్(78) కూడా ఒక‌రు. అయితే అప్పుడు ప్రాణాలు కాపాడుకున్న స్టీఫెన్ కూప‌ర్, తాజాగా కొవిడ్ మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి చ‌నిపోయాడు.

Published : 05 Jul 2020 21:54 IST

న్యూయార్క్‌: 2001లో వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్ కుప్ప‌కూలుతున్న స‌మ‌యంలో తీసిన కొన్ని ఫోటోలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విశేషంగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. భారీ జంట భ‌వ‌నాల శిథిలాల‌నుంచి తప్పించుకునేందుకు అక్క‌డి ప్ర‌జ‌లు ప్రాణాల‌ను అర‌చేతిలో పెట్టుకొని ప‌రుగులు తీశారు. వీరిలో న్యూయార్క్‌కు చెందిన స్టీఫెన్ కూప‌ర్(78) కూడా ఒక‌రు. అయితే అప్పుడు ప్రాణాలు కాపాడుకున్న స్టీఫెన్ కూప‌ర్, తాజాగా కొవిడ్ మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి చ‌నిపోయాడు.

సెప్టెంబ‌ర్‌ 11, 2001న వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌ జంట భ‌వ‌నాలు కూలుతున్న‌ప్పుడు ప్ర‌జలు ప‌రుగెత్తున్న ఫోటోల‌ను ఓ అంత‌ర్జాతీయ వార్తా సంస్థ‌ ఫోటోగ్రాఫ‌ర్ త‌న కెమెరాల్లో బంధించారు. పై ఫోటోలో‌ న‌ల్ల‌చొక్కా వేసుకొని, కొన్ని డాకుమెంట్ల‌ను చేతప‌ట్టుకొని ప‌రుగెత్తుతున్న‌ వ్యక్తే స్టీఫెన్ కూప‌ర్. తాజాగా క‌రోనా వైర‌స్ సోకి కూప‌ర్ మ‌ర‌ణించిన‌ట్లు అత‌డి కుటుంబస‌భ్యులు వెల్ల‌డించారు. న్యూయార్క్‌కు చెందిన స్టీఫెన్ కూప‌ర్‌కు ఆ ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు 60 ఏళ్ళు. ప్ర‌స్తుతం ఫ్లోరిడాలో నివ‌సిస్తున్న స్టీఫెన్ కూప‌ర్ 9/11 ఘ‌ట‌న‌ స‌మ‌యంలో ప‌రుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నాడు. తాజాగా కొవిడ్‌-19 నిర్ధార‌ణ కావ‌డంతో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మార్చి 28న కన్నుమూశాడు.

వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్ కూలుతున్న స‌మ‌యంలో తీసిన ఈ ఫోటో ప్ర‌పంచ‌వ్యాప్తంగా వార్తాప‌త్రిక‌లు, మ్యాగ‌జైన్ల‌లో ప్ర‌ముఖంగా ప్ర‌చురితం అయ్యింది. అంతేకాకుండా న్యూయార్క్‌లో ఉన్న 9/11 మెమోరియ‌ల్ మ్యూజియంలోనూ ఈ ఫోటోను ప్ర‌ద‌ర్శన‌కు ఉంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని