దిల్లీ బడ్జెట్‌కు ఎట్టకేలకు కేంద్రం ఆమోదం

2023-24 సంవత్సరానికి సంబంధించి దిల్లీ ప్రభుత్వ బడ్జెట్టుకు కేంద్రం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది.

Published : 22 Mar 2023 04:32 IST

అనుమతి నిరాకరణతో తొలుత గందరగోళం
‘పెద్దన్న మోదీ’తో కలిసి పనిచేస్తా: కేజ్రీవాల్‌

దిల్లీ: 2023-24 సంవత్సరానికి సంబంధించి దిల్లీ ప్రభుత్వ బడ్జెట్టుకు కేంద్రం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. తొలుత ఈ ఆమోదం లభించక మంగళవారం దానిని దిల్లీ శాసనసభలో ప్రవేశపెట్టలేకపోయారు. బడ్జెట్టును అడ్డుకోవద్దంటూ ప్రధాని మోదీకి సీఎం కేజ్రీవాల్‌ లేఖ రాశారు. తర్వాత గంటల వ్యవధిలోనే కేంద్రం ఆమోదం లభించింది. వెంటనే కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. నరేంద్ర మోదీతో కలిసి పనిచేయాలనుకుంటున్నానని ట్వీట్‌ చేశారు. ‘మీరు పెద్దన్న. నేను చిన్న తమ్ముడిని. నాకు మీరు మద్దతు ఇస్తే నేనూ సహకరిస్తా. చిన్నతమ్ముడి హృదయాన్ని గెలుచుకోవాలంటే ముందు అతన్ని ప్రేమించండి’ అని చెప్పారు. పోరాడి అలసిపోయామనీ, దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదని అన్నారు. కేంద్రంతో పోరాటం లేకపోతే దిల్లీ పదిరెట్లు ఎక్కువగా పురోగతి సాధించి ఉండేదని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని