Kishan Reddy: దేశంలోని ప్రతి పర్యాటక కేంద్రంలో రామోజీ ఫిల్మ్‌సిటీ తరహా చిత్రనగరి

పర్యాటకానికి భారత్‌ను తొలి గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

Updated : 24 May 2023 08:37 IST

కిషన్‌రెడ్డి ఆకాంక్ష

శ్రీనగర్‌: పర్యాటకానికి భారత్‌ను తొలి గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. అందులో ఫిల్మ్‌ టూరిజం ఒకటని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరుగుతున్న మూడు రోజుల జీ-20 సమావేశాల్లో పాల్గొన్న ఆయన మంగళవారం ‘ఈటీవీ భారత్‌’తో మాట్లాడారు. నంబరు 1 ఫిల్మ్‌ సిటీ అయిన రామోజీ ఫిల్మ్‌సిటీ తన సొంతరాష్ట్రం తెలంగాణలో ఉండడం గర్వకారణమని తెలిపారు. జమ్మూకశ్మీర్‌ సహా అన్ని పర్యాటక ప్రదేశాల్లో అలాంటి ఫిల్మ్‌సిటీలు ఉండాలని ఆకాంక్షించారు. ఈ జీ-20 సదస్సు ముఖ్య ఎజెండా పర్యాటకమేనని తెలిపారు. ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు ముఖ్యమని, అవి లేకుండా ఇంత పెద్ద దేశంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయలేమని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని