ప్రధాని ‘డిగ్రీ’ కేసులో కేజ్రీవాల్‌కు తాజాగా సమన్లు

ప్రధాని మోదీ డిగ్రీ అంశంలో వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసి తమ విశ్వవిద్యాలయానికి పరువునష్టం కలిగించారని గుజరాత్‌ యూనివర్సిటీ దాఖలు చేసిన కేసులో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆప్‌ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్‌కు మంగళవారం మళ్లీ స్థానిక కోర్టు సమన్లు పంపింది.

Published : 24 May 2023 05:10 IST

అహ్మదాబాద్‌: ప్రధాని మోదీ డిగ్రీ అంశంలో వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసి తమ విశ్వవిద్యాలయానికి పరువునష్టం కలిగించారని గుజరాత్‌ యూనివర్సిటీ దాఖలు చేసిన కేసులో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆప్‌ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్‌కు మంగళవారం మళ్లీ స్థానిక కోర్టు సమన్లు పంపింది. ఇరువురు జూన్‌ 7న న్యాయస్థానంలో హాజరుకావాలని అందులో పేర్కొంది. ఈ  కేసులో మంగళవారం కోర్టుకు రావాలని గతంలో జారీ చేసిన సమన్లు కేజ్రీవాల్‌కు, సంజయ్‌కు అందాయో లేదో అన్న విషయంలో స్పష్టత లేదని.. వర్సిటీ న్యాయవాది తెలపడంతో న్యాయస్థానం ఈ తాజా సమన్లను పంపింది. మోదీ డిగ్రీకి సంబంధించిన సమాచారం అందించాలని ప్రధాన సమాచార కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులను పక్కనపెడుతూ గుజరాత్‌ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత తమ విద్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని కేజ్రీవాల్‌, సంజయ్‌ అవమానకర వ్యాఖ్యలు చేశారని గుజరాత్‌వర్సిటీ ఈ కేసులో పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు