సావర్కర్‌ నేటికీ స్ఫూర్తిదాయకం

సావర్కర్‌ త్యాగం, ధైర్యం ఈ రోజుకీ మనకి స్ఫూర్తినిస్తాయని ప్రధాని మోదీ అన్నారు. ఆయనకు ఉన్న నిర్భయత్వం, స్వాభిమానం బానిస మనస్తత్వాన్ని అంగీకరించదని వ్యాఖ్యానించారు.

Published : 29 May 2023 05:23 IST

‘మన్‌కీ బాత్‌’లో మోదీ

దిల్లీ: సావర్కర్‌ త్యాగం, ధైర్యం ఈ రోజుకీ మనకి స్ఫూర్తినిస్తాయని ప్రధాని మోదీ అన్నారు. ఆయనకు ఉన్న నిర్భయత్వం, స్వాభిమానం బానిస మనస్తత్వాన్ని అంగీకరించదని వ్యాఖ్యానించారు. వీర్‌ సావర్కర్‌ జయంతి సందర్భంగా మన్‌ కీ బాత్‌ ఆదివారం ఎపిసోడ్‌లో మోదీ ఆయన గురించి మాట్లాడారు. అండమాన్‌లోని కాలాపానీ కారాగారంలో సావర్కర్‌ బందీగా ఉన్న గదిని దర్శించిన రోజుని ఇప్పటికీ మరచిపోలేనని మోదీ పేర్కొన్నారు. జూన్‌ 4న సంత్‌ కబీర్‌ జయంతి సందర్భంగా ఆయన సమాజంలో తీసుకొచ్చిన మార్పును మోదీ గుర్తుచేశారు. ప్రజల్ని విభజించే ప్రతి చర్యనూ కబీర్‌ అడ్డుకున్నారని, సమాజాన్ని జాగృతం చేశారన్నారు. మన్‌ కీ బాత్‌ ఎపిసోడ్‌లో విద్యాశాఖ కార్యక్రమం ‘యువ సంగం’లో భాగమైన విద్యార్థులతో మోదీ ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని భిన్నత్వాన్ని తెలుసుకునేందుకు సుమారు 1200 మంది విద్యార్థులు 22 రాష్ట్రాల్లో పర్యటించారని తెలిపారు. ఈ మన్‌ కీ బాత్‌ ఎపిసోడ్‌ డబుల్‌ సెంచరీకి తొలి అడుగని ప్రధాని వ్యాఖ్యానించారు. అంతకుముందు ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు పాత పార్లమెంటులోని సెంట్రల్‌హాల్‌లో ఉన్న సావర్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని