చాక్లెట్‌ గణపతి!

మట్టి.. పేపరు.. పలురకాల దినుసులతో వినాయక విగ్రహాలను చూశాం. ముంబయిలోని శాంతాక్రజ్‌ ప్రాంతంలో నివసిస్తున్న కమర్షియల్‌ డిజైనర్‌ రింతూ రాథోడ్‌ ఈ ఏడాది వినాయక చవితి వేడుకలకు రెండడుగుల చాక్లెట్‌ గణపతిని తయారు చేశారు.

Published : 24 Sep 2023 04:37 IST

ముంబయి: మట్టి.. పేపరు.. పలురకాల దినుసులతో వినాయక విగ్రహాలను చూశాం. ముంబయిలోని శాంతాక్రజ్‌ ప్రాంతంలో నివసిస్తున్న కమర్షియల్‌ డిజైనర్‌ రింతూ రాథోడ్‌ ఈ ఏడాది వినాయక చవితి వేడుకలకు రెండడుగుల చాక్లెట్‌ గణపతిని తయారు చేశారు. తొమ్మిది రకాల చిరుధాన్యాలను కూడా ఇందులో వాడారు. ఈ ‘వృశ్చికాసన’ వినాయకుణ్ని ఎంచక్కా తినేయవచ్చు. ‘‘ఈ ముద్ర మన పురాణాల్లో ఉంది. నేను ఇటీవలే నాచురోపతి కోర్సు పూర్తి చేశా. కాబట్టి, రెండింటినీ మిళితం చేసి ఈ భంగిమలో విగ్రహం తయారుచేశా. ఇది ‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం’ కావడంతో కోకో (చాక్లెట్‌) పొడికి చిరుధాన్యాలు, ఎండు ఫలాల పేస్టు, బెల్లం కలిపి ఇందులో వాడా’’ అని రింతూ వివరించారు. 40 కేజీల బరువు ఉన్న ఈ విగ్రహ తయారీకి 20 గంటల సమయం పట్టింది. కరిగిపోకుండా ఏసీ గదిలో దీన్ని ఏర్పాటు చేశారు. 11వ రోజున ఈ గణపతిని పాలలో నిమజ్జనం చేసి, చాక్లెట్‌ కలిసిన పాలను స్థానికులకు, నిరుపేద పిల్లలకు పంపిణీ చేస్తామని రింతూ తెలిపారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని