కేంద్ర చట్టంపై దిల్లీ ప్రభుత్వ సవాలు విచారణకు సుప్రీంకోర్టు పచ్చజెండా

దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

Published : 27 Apr 2024 05:33 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు అధికారం కట్టపెడుతూ కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు శుక్రవారం వెల్లడించింది. అంతకు ముందు ఈ అంశంపై విచారణ చేపట్టాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనానికి ఆప్‌ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వి విజ్ఞప్తి చేశారు. కేంద్రం చర్యతో దిల్లీలో పాలనా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయిందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని