‘జైకోవ్‌-డీ’ 3 డోసుల టీకా ధర రూ. 1,900!

జైకోవ్‌-డీ కరోనా టీకా ధర విషయమై కేంద్ర ప్రభుత్వం, జైడస్‌ క్యాడిలా కంపెనీ మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 12 ఏళ్లు పైబడిన వారికి వేసే ఈ 3 డోసుల.....

Published : 04 Oct 2021 04:53 IST

జైడస్‌ క్యాడిలా ప్రతిపాదన

తగ్గించేందుకు కేంద్రం చర్చలు

దిల్లీ: జైకోవ్‌-డీ కరోనా టీకా ధర విషయమై కేంద్ర ప్రభుత్వం, జైడస్‌ క్యాడిలా కంపెనీ మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 12 ఏళ్లు పైబడిన వారికి వేసే ఈ 3 డోసుల టీకా ధరను జైడస్‌ క్యాడిలా కంపెనీ రూ. 1,900గా ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ ధరను తగ్గించేందుకు కేంద్ర చర్చలు జరుపుతోందని.. ఈ వారంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి. ‘‘సూది అవసరం లేని ఈ డీఎన్‌ఏ టీకాను వేయడానికి ఉపయోగించే జెట్‌ ఇంజెక్టర్‌ ధర రూ. 30,000 వరకు ఉంటుంది. ఒక జెట్‌ ఇంజెక్టర్‌తో 20,000 వరకు డోసులు వేసే వీలుంటుంది. టీకా తొలి డోసు వేసిన 28 రోజులకు రెండోది, 56 రోజులకు మూడోది వేయాల్సి ఉంటుంది’’ అని తెలిపాయి. ఇంతవరకు జైడస్‌ క్యాడిలా, కేంద్ర ప్రభుత్వం మధ్య 3 దఫాలుగా చర్చలు జరిగినట్లు వెల్లడించాయి. మరోవైపు వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలోకి జైకోవ్‌-డీని చేర్చే విషయమై ఇమ్యునైజేషన్‌కు సంబంధించిన జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టాగీ) సిఫార్సుల కోసం కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఎదురు చూస్తున్నట్లు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని