Bipin Rawat: స్వగ్రామంలో ఇల్లు కట్టుకుందామని..

జనరల్‌ బిపిన్‌ రావత్‌ చివరిసారిగా తన స్వగ్రామాన్ని 2018లో సందర్శించారు. పదవీ విరమణ తర్వాత అక్కడే సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సమీప బంధువు భరత్‌ సింగ్‌ రావత్‌ (70) గుర్తుచేసుకున్నారు.

Updated : 09 Dec 2021 06:53 IST

ఊరికి ఉపకారం చేద్దామనుకున్న రావత్‌

పౌరి (ఉత్తరాఖండ్‌): జనరల్‌ బిపిన్‌ రావత్‌ చివరిసారిగా తన స్వగ్రామాన్ని 2018లో సందర్శించారు. పదవీ విరమణ తర్వాత అక్కడే సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సమీప బంధువు భరత్‌ సింగ్‌ రావత్‌ (70) గుర్తుచేసుకున్నారు. ఇక్కడకు వచ్చినప్పుడు ఆయన తమ కుల దేవతకు పూజలు చేశారనీ చెప్పారు. ఇక్కడినుంచి ఉద్యోగరీత్యా వెళ్లడం చాలా బాధగా ఉందని, తిరిగి వచ్చాక గ్రామానికి ఎంతోకొంత చేయాలని ఉందని కూడా బిపిన్‌ రావత్‌ అప్పట్లో అన్నారని భరత్‌ సింగ్‌ రావత్‌ తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మళ్లీ గ్రామానికి వస్తానన్నారని, అంతలోనే ఇలా చూడాల్సి వస్తుందనుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని