IPS: రాత్రి వేళ సైకిల్‌పై ఐపీఎస్‌ అధికారిణి గస్తీ

రాత్రిపూట సైకిల్‌పై పర్యటిస్తూ మహిళా ఐపీఎస్‌ అధికారి గస్తీ నిర్వహించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆమెను అభినందించారు. 

Updated : 26 Mar 2022 07:55 IST

తమిళనాడు సీఎం అభినందన

చెన్నై, న్యూస్‌టుడే: రాత్రిపూట సైకిల్‌పై పర్యటిస్తూ మహిళా ఐపీఎస్‌ అధికారి గస్తీ నిర్వహించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆమెను అభినందించారు. 2008 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన రమ్య భారతి.. గ్రేటర్‌ చెన్నై ఉత్తర మండల సంయుక్త పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి చెన్నైలోని ఫ్లవర్‌ బజారు నుంచి చాకలిపేట వరకు సైకిల్‌పై గస్తీ నిర్వహించారు. పోలీసులు విధులు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. రోడ్లపై తిరుగుతున్న అనుమానితులను విచారించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఈ విషయం దుబాయ్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ దృష్టికి వెళ్లింది. ట్విటర్‌ ద్వారా ఆమెకు అభినందనలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని