logo

మల్కాజిగిరి.. విలక్షణమే ప్రతిసారీ

అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గమైన మల్కాజిగిరిలో ప్రజల తీర్పు ప్రతిసారీ విలక్షణంగానే ఉంటోంది.  2009లో ఏర్పాటైన ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 31,50,303 మంది ఓటర్లు ఉన్నారు.

Updated : 10 May 2024 08:32 IST

తిపెద్ద లోక్‌సభ నియోజకవర్గమైన మల్కాజిగిరిలో ప్రజల తీర్పు ప్రతిసారీ విలక్షణంగానే ఉంటోంది.  2009లో ఏర్పాటైన ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 31,50,303 మంది ఓటర్లు ఉన్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సర్వే సత్యనారాయణ తెదేపా అభ్యర్థి బీంసేన్‌పై విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి మల్లారెడ్డిని  తెదేపా బరిలోకి దింపింది. తెదేపా నుంచి తెరాసలోకి చేరిన మైనంపల్లి హనుమంతరావు ఇక్కడ నుంచి పోటీ చేశారు. రాష్ట్రమంతా తెరాస హవా కొనసాగినా మల్లారెడ్డి విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో  కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన రేవంత్‌రెడ్డి.. తెరాస అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డిపై విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో భాజపా నుంచి ఈటల రాజేందర్‌, కాంగ్రెస్‌ నుంచి పట్నం సునీత, భారాస అభ్యర్థిగా లక్ష్మారెడ్డి పోటీ పడుతున్నారు. ఈసారి ఎలాంటి విలక్షణ తీర్పు ఇస్తారోమరి..

న్యూస్‌టుడే, గౌతంనగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు