యువతుల వివాహ వయసు పెంపునకు గట్టి వ్యతిరేకత!

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బాల్య వివాహాల నిషేధ(సవరణ) బిల్లులోని ‘యువతుల వివాహ వయసు 21 ఏళ్లకు పెంపు’నకు ప్రజా స్పందనల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఈ అంశంపై పార్లమెంటు స్థాయీ సంఘం

Updated : 14 Apr 2022 08:06 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బాల్య వివాహాల నిషేధ(సవరణ) బిల్లులోని ‘యువతుల వివాహ వయసు 21 ఏళ్లకు పెంపు’నకు ప్రజా స్పందనల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఈ అంశంపై పార్లమెంటు స్థాయీ సంఘం ప్రజాభిప్రాయాన్ని కోరగా అందిన అభిప్రాయాల్లో 95 శాతం ప్రతికూలంగానే వచ్చాయి. భాజపా ఎంపీ వినయ్‌ సహస్రబుద్ధే నేతృత్వంలోని పార్లమెంటు స్థాయీ సంఘానికి(విద్య, మహిళలు, బాలలు, యువత, క్రీడలు) చేరిన 95వేల ఈమెయిళ్లలో 90వేల సందేశాలు... వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనను తిరస్కరించాయి. మహిళల మేలు కోసం ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాన్ని అడ్డుకునే కుట్రలో భాగంగానే ప్రతికూల స్పందనలు వచ్చాయన్న అనుమానాన్ని కమిటీ వ్యక్తం చేసింది. అత్యధిక సందేశాల్లోని విషయం చాలావరకు ఒకేవిధంగా ఉందని, అవి ఒకే చోటు నుంచి వచ్చి ఉండొచ్చనే సందేహాన్ని వెలిబుచ్చాయి. బాల్య విహాల నిషేధ(సవరణ) బిల్లును కేంద్రం గత  డిసెంబరులో లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అనంతరం స్థాయీ సంఘం పరిశీలనకు బిల్లును పంపించారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న మత సంస్థల ప్రతినిధులను స్థాయీ సంఘం ఆహ్వానించి మాట్లాడాలని కమిటీ సభ్యులుసూచించారు. పార్లమెంటరీ కమిటీ సభ్యులు దేశవ్యాప్తంగా పర్యటించి మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు