Venkaiah Naidu: ఉప రాష్ట్రపతికీ తప్పని సామాజిక మాధ్యమాల పీడ

సామాజిక మాధ్యమాల నకిలీ సందేశాల బెడద ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకూ తప్పలేదు. ఇటీవల కాలంలో ఫేస్‌బుక్‌, వాట్సప్‌లను దుర్వినియోగం చేస్తూ ఆర్థిక సహాయం కావాలంటూ కొందరు మోసాలకు పాల్పడుతున్న

Updated : 24 Apr 2022 08:01 IST

ఈనాడు, దిల్లీ: సామాజిక మాధ్యమాల నకిలీ సందేశాల బెడద ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకూ తప్పలేదు. ఇటీవల కాలంలో ఫేస్‌బుక్‌, వాట్సప్‌లను దుర్వినియోగం చేస్తూ ఆర్థిక సహాయం కావాలంటూ కొందరు మోసాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. అదే రీతిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడినని చెప్పుకొంటూ.. ఆర్థిక సహాయం కావాలని కోరుతూ. ఓ వ్యక్తి పలువురికి వాట్సప్‌ సందేశాలు పంపడాన్ని గుర్తించారు. 94390 73183 మొబైల్‌ నంబరుతో ఈ సందేశాలు వెళ్లాయి. విషయం ఉప రాష్ట్రపతి దృష్టికి వెళ్లడంతో ఆయన తన సచివాలయం ద్వారా కేంద్ర హోం శాఖను అప్రమత్తం చేశారు. ఇటువంటి సందేశాలు మరిన్ని నంబర్ల నుంచి వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని దేశ ప్రజలకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని