బట్టతల బట్టబయలై.. ఆగిన పెళ్లి!

వరుడు పెట్టుకున్న విగ్గు ఊడిపోయి బట్టతల బయటపడటంతో వివాహం అర్ధంతరంగా ఆగిపోయిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో తాజాగా చోటుచేసుకుంది. అక్కడ పెళ్లితంతులో భాగంగా జయమాల వేడుక నిర్వహించారు. ఆపై కాసేపట్లో

Published : 24 May 2022 05:10 IST

యూపీలోని ఉన్నావ్‌లో విచిత్ర ఘటన

లఖ్‌నవూ: వరుడు పెట్టుకున్న విగ్గు ఊడిపోయి బట్టతల బయటపడటంతో వివాహం అర్ధంతరంగా ఆగిపోయిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో తాజాగా చోటుచేసుకుంది. అక్కడ పెళ్లితంతులో భాగంగా జయమాల వేడుక నిర్వహించారు. ఆపై కాసేపట్లో వివాహం జరగాల్సి ఉండగా.. ఉన్నట్టుండి వరుడు స్పృహ కోల్పోయాడు. దీంతో వధువు సోదరుడు అతడి ముఖంపై నీళ్లు చల్లాడు. కాబోయే బావను పైకి లేపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో తలపాగా తీయగా.. వరుడి విగ్గు ఊడిపోయింది. అది చూసి పెళ్లికుమార్తె సహా అమ్మాయి తరఫు వారంతా అవాక్కయ్యారు. మోసంతో పెళ్లి చేసేందుకు ప్రయత్నించారని వారు ఆరోపించారు. వధువు, వరుడి కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. బట్టతల ఉన్న వ్యక్తిని చేసుకోనంటూ వధువు మొండికేయడంతో వివాహం ఆగిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని