సరోగసీ తల్లులకు ఆరోగ్య బీమా

సరోగసీ విధానంలో పిల్లల్ని కనాలనుకుంటున్న జంటలు ఇకపై అద్దె గర్భం దాల్చే వారికి ఆరోగ్య బీమా చేయించాల్సి ఉంటుంది. సరోగసీ తల్లులకు మూడేళ్ల పాటు ఈ కవచాన్ని అందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఈ ఏడాది జనవరి 25న ‘సరోగసీ (నియంత్రణ)

Published : 24 Jun 2022 03:56 IST

దిల్లీ: సరోగసీ విధానంలో పిల్లల్ని కనాలనుకుంటున్న జంటలు ఇకపై అద్దె గర్భం దాల్చే వారికి ఆరోగ్య బీమా చేయించాల్సి ఉంటుంది. సరోగసీ తల్లులకు మూడేళ్ల పాటు ఈ కవచాన్ని అందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఈ ఏడాది జనవరి 25న ‘సరోగసీ (నియంత్రణ) చట్టం-2021’ అమలులోకి రాగా, అద్దె గర్భం దాల్చే తల్లుల ఆరోగ్య పరిరక్షణకు కేంద్ర ఆరోగ్య శాఖ ఈ నెల 21న కొన్ని విధివిధానాలను నిర్దేశించింది. ఇందులో భాగంగా గర్భిణిగా ఉన్న సమయంలోనూ, ప్రసవానంతరం ఎదురయ్యే అనారోగ్య సమస్యలకు సంబంధించిన చికిత్సల మొత్తానికి సరిపడేలా సరోగసీ తల్లులకు 36 నెలలపాటు ఆరోగ్య బీమా చేయించాలని ఈ విధానాన్ని ఎంచుకునే జంటలకు స్పష్టం చేసింది. వారి వైద్య ఖర్చులు, ఆరోగ్య సమస్యలు, జబ్బులతోపాటు మరణాలు సంభవిస్తే అందుకు సరిపడా పరిహారాన్ని చెల్లిస్తామంటూ న్యాయస్థానంలో ప్రమాణపత్రం సమర్పించాలని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని