హవాలా కేసులో ఇద్దరు వ్యాపారుల అరెస్టు

ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) నేత, దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌కు సంబంధించిన నగదు అక్రమ చలామణి(మనీలాండరింగ్‌) కేసులో ఇద్దరు వ్యాపారులను ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) శుక్రవారం అరెస్టు చేసింది. దిల్లీకి చెందిన వ్యాపారవేత్తలు

Published : 02 Jul 2022 04:46 IST

దిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్‌  కేసులో ఈడీ చర్యలు

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) నేత, దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌కు సంబంధించిన నగదు అక్రమ చలామణి(మనీలాండరింగ్‌) కేసులో ఇద్దరు వ్యాపారులను ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) శుక్రవారం అరెస్టు చేసింది. దిల్లీకి చెందిన వ్యాపారవేత్తలు వైభవ్‌ జైన్‌, అంకుశ్‌ జైన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మే 30న అరెస్ట్‌ అయిన సత్యేందర్‌ జైన్‌ ప్రస్తుతం జ్యూడీషియల్‌ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.

ఐటీ ప్రేమలేఖ అందింది: పవార్‌

2004, 2009, 2014, 2020 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లకు సంబంధించి ఆదాయపు పన్ను విభాగం నుంచి తనకు ఓ ‘ప్రేమ’ లేఖ వచ్చిందని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ట్వీట్‌ చేశారు. దీనికి సంబంధించి ఎలాంటి ఆందోళన లేదని, తగిన సమాచారమంతా తన వద్ద ఉందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని