వివాదాస్పదంగా మారిన ‘కాళీ’ పోస్టర్‌

దర్శకురాలు, రచయిత్రి, నటి లీనా మణిమేగలై తన తాజా చిత్రం ‘కాళీ’కి సంబంధించి శనివారం విడుదలచేసిన పోస్టర్‌ తీవ్ర వివాదాస్పందంగా మారింది. కాళీమాత పాత్రధారి... స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్ల (ఎల్‌జీబీటీక్వీర్‌) జెండాను చేతబూని,

Published : 05 Jul 2022 03:49 IST

నమ్మిన విషయాన్ని చనిపోయేవరకూ నిర్భయంగా చెబుతానన్న లీలా మణిమేగలై

దిల్లీ: దర్శకురాలు, రచయిత్రి, నటి లీనా మణిమేగలై తన తాజా చిత్రం ‘కాళీ’కి సంబంధించి శనివారం విడుదలచేసిన పోస్టర్‌ తీవ్ర వివాదాస్పందంగా మారింది. కాళీమాత పాత్రధారి... స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్ల (ఎల్‌జీబీటీక్వీర్‌) జెండాను చేతబూని, సిగరెట్‌ తాగుతున్న దృశ్యం ఈ పోస్టరులో ఉండటమే వివాదానికి కారణం. మతపరమైన మనోభావాలను లీల దెబ్బతీశారని, ఆమెను అరెస్టు చేయాలంటూ ‘గో మహాసభ’ ప్రతినిధులు దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘అరెస్ట్‌ లీలా మణిమేగలై’ హ్యాష్‌ట్యాగ్‌తో ఆన్‌లైన్‌లో ప్రచారం చేపట్టారు. దీంతో ఆమె ట్విటర్‌లో స్పందించారు. ‘‘నేను నమ్మిన విషయాన్ని బతికి ఉన్నంతవరకూ నిర్భయంగా చెబుతాను. నా ప్రాణాన్ని మూల్యంగా చెల్లించాల్సి వచ్చినా, అందుకు సిద్ధమే. ఈ చిత్రం టొరంటో అగాఖాన్‌ మ్యూజియంలోని రిథమ్స్‌ ఆఫ్‌ కెనడా విభాగానికి చెందినది. పోస్టరులోని సందర్భాన్ని తెలుసుకోవాలంటే ఈ సినిమాను పూర్తిగా చూడండి. కాళీ ఒక సాయంత్రం టొరంటో వీధుల్లో విహరిస్తున్నప్పుడు ఏం జరిగిందన్నది దీని ఇతివృత్తం. ఈ చిత్రాన్ని చూశాక లవ్‌ యూ లీలా మణిమేగలై అని మీరే అంటారు’’ అని ఆమె పేర్కొన్నారు. మధురైలో జన్మించిన లీల టొరంటోలో ఉంటున్నారు. కెనడాలోని హిందూ సమాజం నుంచి విజ్ఞప్తులు రావడంతో... కాళీ పోస్టర్‌ను తొలగించాలంటూ కెనడా అధికారులకు అక్కడి భారత హైకమిషన్‌ విజ్ఞప్తి చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని