మొహర్రం ఊరేగింపులను అడ్డుకునేందుకు శ్రీనగర్‌లో ఆంక్షలు

పది రోజుల సంతాప సమయంలో భాగంగా ఎనిమిదో రోజైన ఆదివారం నాడు షియా ముస్లింలు మొహర్రం ఊరేగింపులు చేపట్టకుండా అడ్డుకునేందుకు జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని వివిధ ప్రాంతాల్లో

Published : 08 Aug 2022 05:45 IST

శ్రీనగర్‌: పది రోజుల సంతాప సమయంలో భాగంగా ఎనిమిదో రోజైన ఆదివారం నాడు షియా ముస్లింలు మొహర్రం ఊరేగింపులు చేపట్టకుండా అడ్డుకునేందుకు జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని వివిధ ప్రాంతాల్లో అధికారులు ఆదివారం కర్ఫ్యూ తరహా ఆంక్షలను విధించారు. గతంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు ప్రస్తావిస్తూ ఊరేగింపులకు అనుమతి నిరాకరించారు. ఈ సందర్భంగా శ్రీనగర్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్‌ఎస్‌పీ) రాకేశ్‌ బల్వాల్‌ మాట్లాడుతూ.. శ్రీనగర్‌లోని ఎనిమిది పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఊరేగింపులు, ప్రజలు గుమిగూడడంపై నిషేధం విధించినట్లు తెలిపారు. శాంతిభద్రతలు గాడితప్పకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని