ముందుజాగ్రత్త డోసుగా కార్బెవ్యాక్స్‌!

తొలి రెండు టీకా డోసులుగా కొవాగ్జిన్‌ లేదా కొవిషీల్డ్‌ తీసుకున్న 18 ఏళ్లు పైబడినవారికి ముందుజాగ్రత్త డోసుగా బయోలాజికల్‌ ఈకి చెందిన కార్బెవ్యాక్స్‌ను వినియోగించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ త్వరలోనే ఆమోదం తెలుపనుందని అధికారవర్గాలు

Published : 10 Aug 2022 05:59 IST

త్వరలోనే అనుమతించనున్న కేంద్రం

దిల్లీ: తొలి రెండు టీకా డోసులుగా కొవాగ్జిన్‌ లేదా కొవిషీల్డ్‌ తీసుకున్న 18 ఏళ్లు పైబడినవారికి ముందుజాగ్రత్త డోసుగా బయోలాజికల్‌ ఈకి చెందిన కార్బెవ్యాక్స్‌ను వినియోగించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ త్వరలోనే ఆమోదం తెలుపనుందని అధికారవర్గాలు మంగళవారమిక్కడ తెలిపాయి. ఎన్‌టాగీ (ఇమ్యునైజేషన్‌పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం) వర్కింగ్‌ గ్రూప్‌ సిఫార్సు మేరకే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించాయి. అధికారికంగా ఆమోదం లభిస్తే.. దేశంలో కొవిడ్‌-19కు సంబంధించి తొలి రెండు డోసులుగా ఒక కంపెనీ టీకా, ముందుజాగ్రత్త డోసుగా వేరే కంపెనీ టీకా వేయడం తొలిసారి అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని