ఉచితాలపై కమిటీ స్వాగతించదగినదే

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇష్టారాజ్యాన ఉచితాల పంపిణీ హామీలు గుప్పిస్తుండటంపై మేధోమథనం జరిపేందుకు కమిటీని ఏర్పాటుచేయాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల చేసిన సూచనను తాము స్వాగతిస్తున్నట్లు ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది.

Published : 11 Aug 2022 05:25 IST

సుప్రీంకోర్టుకు నివేదించిన ఈసీ

దిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇష్టారాజ్యాన ఉచితాల పంపిణీ హామీలు గుప్పిస్తుండటంపై మేధోమథనం జరిపేందుకు కమిటీని ఏర్పాటుచేయాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల చేసిన సూచనను తాము స్వాగతిస్తున్నట్లు ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. అయితే కమిటీలో భాగస్వామిగా చేరేందుకు నిరాకరించింది. ఉచితాల పంపిణీతో భవిష్యత్తులో ఆర్థిక విపత్తు ముంచుకొచ్చే ముప్పుందని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 3న ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. కేంద్రప్రభుత్వం, నీతి ఆయోగ్‌, ఆర్థిక సంఘం, రిజర్వు బ్యాంకు సహా భాగస్వామ్యపక్షాలన్నీ ఈ వ్యవహారంలో నిర్మాణాత్మక సూచనలు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా ఈసీ బుధవారం తమ స్పందనను దాఖలు చేసింది. ఉచితాలపై చర్చించేందుకు ఏర్పడే కమిటీలో ప్రభుత్వ సంస్థలకూ భాగస్వామ్యం ఉండే అవకాశముందని అందులో అభిప్రాయపడింది. కాబట్టి రాజ్యాంగబద్ధ సంస్థగా ఉన్న తాము అందులో చేరడం సరికాదని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని