కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ పొందిన వయోజనులకు ముందుజాగ్రత్త డోసుగా కార్బెవ్యాక్స్‌

తొలి రెండు టీకా డోసులుగా కొవాగ్జిన్‌ లేదా కొవిషీల్డ్‌ తీసుకున్న 18 ఏళ్లు పైబడినవారికి ముందుజాగ్రత్త డోసుగా బయోలాజికల్‌ ఈ సంస్థకు చెందిన కార్బెవ్యాక్స్‌ను వినియోగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అధికారికవర్గాలు బుధవారం

Published : 11 Aug 2022 05:15 IST

 ఆమోదించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

దిల్లీ: తొలి రెండు టీకా డోసులుగా కొవాగ్జిన్‌ లేదా కొవిషీల్డ్‌ తీసుకున్న 18 ఏళ్లు పైబడినవారికి ముందుజాగ్రత్త డోసుగా బయోలాజికల్‌ ఈ సంస్థకు చెందిన కార్బెవ్యాక్స్‌ను వినియోగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అధికారికవర్గాలు బుధవారం వెల్లడించాయి. ఎన్‌టాగీ (ఇమ్యునైజేషన్‌పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం) కొవిడ్‌-19 వర్కింగ్‌ గ్రూప్‌ సిఫార్సు మేరకే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. దేశంలో కొవిడ్‌-19కు సంబంధించి తొలి రెండు డోసులుగా ఒక కంపెనీ టీకా, ముందుజాగ్రత్త డోసుగా వేరే కంపెనీ టీకా వేయడానికి అనుమతించడం ఇదే తొలిసారి. తాజా నిర్ణయం కొవిడ్‌-19 పోరులో భారత ఆయుధగారాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్వీట్‌ చేశారు. కొత్త సౌలభ్యం ఈ నెల 12 నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని