Fake Police Station: బిహార్‌లో నకిలీ పోలీస్‌ స్టేషన్‌

ఓ ప్రబుద్ధుడు గెస్ట్‌ హౌస్‌లో నకిలీ పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశాడు. పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరి వద్ద డబ్బులు వసూలు చేశాడు. వారికి నకిలీ పోలీస్‌ యూనిఫాంలు ఇచ్చి పనిలో నియమించుకున్నాడు. వారు నిజంగానే

Updated : 19 Aug 2022 08:32 IST

8 నెలల తర్వాత బండారం బట్టబయలు

ఓ ప్రబుద్ధుడు గెస్ట్‌ హౌస్‌లో నకిలీ పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశాడు. పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరి వద్ద డబ్బులు వసూలు చేశాడు. వారికి నకిలీ పోలీస్‌ యూనిఫాంలు ఇచ్చి పనిలో నియమించుకున్నాడు. వారు నిజంగానే తాము పోలీసు ఉద్యోగాలు చేస్తున్నామనుకున్నారు. వారిద్వారా ప్రధాన నిందితుడు పలువురిని బెదిరించి వసూళ్లకు పాల్పడ్డాడు. ఇలా ఎనిమిది నెలలపాటు వ్యవహారం నడిపించాడు. ఆ తర్వాత వారి బండారం బయటపడింది. బిహార్‌లోని బాంకా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు భోలా యాదవ్‌.. గెస్ట్‌హౌస్‌లో నకిలీ పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశాడు. రూ.వేలు వసూలు చేసి అనిత, జూలీ అనే ఇద్దరు మహిళల్ని పోలీసులుగా నియమించకున్నాడు. మరో ముగ్గురిని తన ముఠాలో కలుపుకొని వారికి డీఎస్పీ, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ లాంటి హోదాలు కట్టబెట్టాడు. వారికి యూనిఫాంలతోపాటు నాటు తుపాకీలు ఇచ్చాడు. వారు చెకింగ్‌ల పేరుతో భయపెట్టి డబ్బు గుంజేవారు.ఈ నకిలీ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే అసలు టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా బుధవారం సాయంత్రం టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన శంభు యాదవ్‌ నాటు తుపాకులతో ఉన్న నకిలీ పోలీసులను చూశారు. అతడికి అనుమానం వచ్చి ఆరా తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని