బాపూజీ చిత్రపటం ధ్వంసం కేసులో రాహుల్‌ పీఏ సహా నలుగురి అరెస్టు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి చెందిన వయనాడ్‌ కార్యాలయంలో  గాంధీజీ చిత్ర పటం ధ్వంసం కేసులో నలుగురు నిందితులను కేరళ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరిలో రాహుల్‌ వ్యక్తిగత సహాయకుడు రథీశ్‌, కార్యాలయ సహాయకుడు,

Published : 20 Aug 2022 04:11 IST

వయనాడ్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి చెందిన వయనాడ్‌ కార్యాలయంలో  గాంధీజీ చిత్ర పటం ధ్వంసం కేసులో నలుగురు నిందితులను కేరళ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరిలో రాహుల్‌ వ్యక్తిగత సహాయకుడు రథీశ్‌, కార్యాలయ సహాయకుడు, మరో ఇద్దరు కాంగ్రెస్‌ కార్యకర్తలు ఉన్నారు. బాపూజీ చిత్ర పటాన్ని ధ్వంసం చేసింది ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలేనని నమ్మించేందుకు యత్నించారని కల్పట్ట పోలీసులు తేల్చారు. వయనాడ్‌ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని బఫర్‌ జోన్‌గా ప్రకటించడం వల్ల అక్కడి ప్రజల ఉపాధి దెబ్బతింటున్నా స్థానిక ఎంపీ  రాహుల్‌ ఏమీ చేయడంలేదంటూ ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు జూన్‌ 24న నిరసనకు దిగారు. కొందరు ఆయన కార్యాలయంలోకి వెళ్లి వస్తువుల్ని ధ్వంసం చేశారు. సీపీఎంను తప్పుబడుతూ సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్‌ ప్రచారం చేసింది. ఈ వీడియోలో గాంధీజీ ఫొటో దెబ్బతిని, నేలపై కనిపించింది.  ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు తీసిన వీడియోలో గాంధీజీ ఫొటో గోడపై సవ్యంగానే ఉంది. దీంతో పోలీసులు రథీశ్‌, మరో ముగ్గురిని ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేసినట్లు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని