అనువాద రోబో!

పలు భాషలను అనువాదం చేసే హ్యూమనాయిడ్‌ రోబోను కర్ణాటక ధార్వాడలోని భారతీయ సమాచార సాంకేతికత సంస్థ (ఐఐఐటీ) శాస్త్రవేత్తలు రూపొందించారు. ఒడిశాలోని గిరిజనులు

Published : 25 Sep 2022 04:37 IST

ధార్వాడ, న్యూస్‌టుడే: పలు భాషలను అనువాదం చేసే హ్యూమనాయిడ్‌ రోబోను కర్ణాటక ధార్వాడలోని భారతీయ సమాచార సాంకేతికత సంస్థ (ఐఐఐటీ) శాస్త్రవేత్తలు రూపొందించారు. ఒడిశాలోని గిరిజనులు వేర్వేరు భాషలను అర్థం చేసుకునేందుకు తయారు చేసిన ఈ రోబోను సోమవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆవిష్కరిస్తారని ఈసీఈ విభాగం ఆచార్యుడు డాక్టర్‌ కె.టి.దీపక్‌ తెలిపారు. ఒడిశాలోని కుయి, ముండారి భాషలు, కర్ణాటకలోని లంబాణి, సోలిగె భాషలను ఆంగ్లంలోకి అనువదించి, వినిపిస్తుందని వివరించారు. మరిన్ని భాషల కోసం మార్పులు చేసుకోవచ్చని చెప్పారు. దిల్లీలోని ఎలక్ట్రానిక్‌, సమాచార సాంకేతికతశాఖ విడుదల చేసిన రూ.44.53 లక్షలతో దీన్ని అభివృద్ధి చేశామన్నారు. ఆచార్యులు డాక్టర్‌ ప్రకాశ్‌ పవార, డాక్టర్‌ సి.బి.శంకరపాడి, మహేశ్‌, డాక్టర్‌ రాజేంద్ర ఎగడి, డాక్టర్‌ పవన్‌కుమార్‌, డాక్టర్‌ రమేశ్‌,  చిన్మయానంద తయారీకి సహకరించారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని