10 యూట్యూబ్‌ ఛానళ్లు.. 45 వీడియోలపై నిషేధం

దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నడంతో పాటు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని పేర్కొంటూ పది యూట్యూబ్‌ ఛానళ్లు, 45 వీడియోలపై కేంద్రం సోమవారం నిషేధం

Published : 27 Sep 2022 05:14 IST

దిల్లీ: దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నడంతో పాటు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని పేర్కొంటూ పది యూట్యూబ్‌ ఛానళ్లు, 45 వీడియోలపై కేంద్రం సోమవారం నిషేధం విధించింది. ప్రభుత్వం వేటు వేసిన ఈ వీడియోల మొత్తం వీక్షకుల సంఖ్య 1.3 కోట్లు అని సమాచార ప్రసార మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇవి కొన్ని సమూహాల మతపరమైన హక్కులను ప్రభుత్వం హరించివేసిందంటూ దుష్ప్రచారం చేశాయని, అగ్నిపథ్‌ పథకం, భారత్‌ సైన్యం, కశ్మీర్‌ తదితర అంశాలకు సంబంధించి నకిలీ వార్తలను ప్రసారం చేశాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని