మహారాష్ట్ర సీఎం శిందే సంతకం ఫోర్జరీ.. వ్యాపారికి రూ.కోటికిపైగా టోకరా

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నకిలీ సంతకంతో ఇద్దరు మోసగాళ్లు ఓ వ్యాపారికి భారీగా టోకరా పెట్టారు. వ్యాపారి నుంచి విడతల వారీగా రూ.1.31 కోట్లు తీసుకున్నారు. ప్రభుత్వ ఈ-పోర్టల్‌లో భాగస్వామ్యం ఇప్పిస్తామని నమ్మించి వ్యాపారి గోపాని నుంచి నిందితులు మొదట రూ.లక్ష వసూలు చేశారు.

Updated : 03 Oct 2022 04:28 IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నకిలీ సంతకంతో ఇద్దరు మోసగాళ్లు ఓ వ్యాపారికి భారీగా టోకరా పెట్టారు. వ్యాపారి నుంచి విడతల వారీగా రూ.1.31 కోట్లు తీసుకున్నారు. ప్రభుత్వ ఈ-పోర్టల్‌లో భాగస్వామ్యం ఇప్పిస్తామని నమ్మించి వ్యాపారి గోపాని నుంచి నిందితులు మొదట రూ.లక్ష వసూలు చేశారు. అనంతరం విడతలవారీగా మొత్తం రూ.1.31 కోట్లు తీసుకున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 25న నిందితులు ఈ-పోర్టల్‌ ఫ్రాంచైజీ కోసం లైసెన్స్‌, పర్మిట్‌, ఇతర రుసుములకు సంబంధించిన రసీదు (పేమెంట్‌ స్లిప్‌)ను గోపానికి ఇచ్చారు. ఆ రసీదులో సీఎం ఏక్‌నాథ్‌ శిందే సంతకం ఇంగ్లీష్‌లో ఉంది. సంతకంపై అనుమానం రావడంతో గోపాని.. వాలివ్‌ పోలీసులను అశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని