ఫోన్‌లో హలో బదులు.. వందేమాతరం అందాం

ప్రజల్లో జాతీయతా భావాన్ని పెంపొందించేలా మహారాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఫోన్‌కాల్స్‌ వచ్చినప్పుడు అవతలి వ్యక్తిని పలకరించడానికి ప్రతిఒక్కరూ వాడే ‘హలో’కు బదులుగా ఇకపై ‘వందేమాతరం’ అనాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Published : 03 Oct 2022 05:11 IST

ప్రచారం ప్రారంభించిన మహారాష్ట్ర ప్రభుత్వం

ముంబయి: ప్రజల్లో జాతీయతా భావాన్ని పెంపొందించేలా మహారాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఫోన్‌కాల్స్‌ వచ్చినప్పుడు అవతలి వ్యక్తిని పలకరించడానికి ప్రతిఒక్కరూ వాడే ‘హలో’కు బదులుగా ఇకపై ‘వందేమాతరం’ అనాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వ అధికారులకు శనివారమే ఓ తీర్మానం జారీ చేసిన శిందే సర్కారు.. ఇది తప్పనిసరేం కాదని, వివిధ ప్రభుత్వ శాఖల్లోని అధిపతులు తమ సిబ్బందిని ‘వందేమాతరం’ అనేలా ప్రోత్సహించాలని కోరింది. దీనిపై ప్రజల్లోనూ అవగాహన కల్పించేందుకు ఆదివారం ప్రచారం మొదలుపెట్టింది. ఈ కార్యక్రమాన్ని మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా వార్ధాలో మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాలశాఖ మంత్రి సుధీర్‌ ముంగంటివార్‌ ప్రారంభించి ర్యాలీలో మాట్లాడారు. మహారాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన 850 మంది ముఖ్య వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం ఆడియో బుక్‌ రూపొందించనుందని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని