icon icon icon
icon icon icon

Lok Sabha Elections: కొనసాగుతోన్న మూడో దశ పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Published : 07 May 2024 10:23 IST

దిల్లీ: సార్వత్రిక సమరంలో (Lok Sabha Elections) మూడో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ విడతలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్‌ జరుగుతోంది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లో ఓటేశారు.

  • గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని పోలింగ్ బూత్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆయన సతీమణి సోనాల్‌ షా, కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జైషా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
  • యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలో సీఎం అందరితోపాటు లైన్లో నిల్చోగా.. గత ఏడాది బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన ఆయన కుమారుడు అనుజ్‌ పటేల్‌ వీల్‌ఛెయిర్‌లో వచ్చి ఓటేశారు. మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా విదిశ అభ్యర్థి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ కుటుంబం ఓటింగ్‌లో పాల్గొంది. 
  • సినిమా ఇండస్ట్రీకి చెందిన రితేశ్ దేశ్‌ముఖ్‌, ఆయన భార్య జెనీలియా, ఆయన సోదరుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ధీరజ్‌ దేశ్‌ముఖ్‌..లాతూర్‌లో ఓటేశారు. 
  • కేంద్రమంత్రులు మన్‌సుఖ్‌ మాండవీయ, ప్రహ్లాద్ జోషి, జ్యోతిరాదిత్య సింధియా, జామ్‌నగర్ భాజపా ఎమ్మెల్యే రివాబా జడేజా, ఎన్‌సీపీ-ఎస్‌సీపీ బారామతి అభ్యర్థి సుప్రియా సూలే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కుటుంబం, ఎన్‌సీపీ-ఎస్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కుటుంబం, కర్ణాటక మంత్రి ప్రియాంక్‌ ఖర్గే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img