Bone fracture: ఎముక విరిగితే.. ఏ చికిత్స మేలో చెప్పేస్తుంది

తుంటి ఎముక విరిగిన వ్యక్తుల్లో ఏ తరహా చికిత్స వ్యూహాన్ని అనుసరిస్తే వారు త్వరగా కోలుకుంటారో వైద్యులు ముందే పక్కాగా నిర్ధారించుకోవడంలో దోహదపడే సరికొత్త కృత్రిమ మేధ (ఏఐ) నమూనాను ఐఐటీ గువాహటి పరిశోధకులు అభివృద్ధి చేశారు.

Updated : 28 Oct 2022 07:26 IST

సరికొత్త కృత్రిమ మేధను సృష్టించిన ఐఐటీ గువాహటి

దిల్లీ: తుంటి ఎముక విరిగిన వ్యక్తుల్లో ఏ తరహా చికిత్స వ్యూహాన్ని అనుసరిస్తే వారు త్వరగా కోలుకుంటారో వైద్యులు ముందే పక్కాగా నిర్ధారించుకోవడంలో దోహదపడే సరికొత్త కృత్రిమ మేధ (ఏఐ) నమూనాను ఐఐటీ గువాహటి పరిశోధకులు అభివృద్ధి చేశారు. ‘ఫజీ లాజిక్‌’గా పిలుస్తున్న ఈ ఏఐని.. ఫినైట్‌ ఎలిమెంట్‌ అనాలసిస్‌తో కలిపి వినియోగించాల్సి ఉంటుందని వారు తెలిపారు. ఎముక విరిగిన తీరు, శరీర ధర్మం ఆధారంగా అది ఆయా వ్యక్తులు కోలుకునేందుకు మెరుగైన చికిత్స వ్యూహాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. ఫలితంగా కోలుకునేందుకు పట్టే సమయం, చికిత్సకయ్యే ఖర్చుల భారం తగ్గుతుందని వివరించారు. బాధితులు సుదీర్ఘకాలం నొప్పిని భరించాల్సిన అవసరం లేకుండా చేస్తుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని