Tamil Nadu: వికటించిన మోకాలి శస్త్రచికిత్స.. క్రీడాకారిణి మృతిపై తమిళనాట వివాదం

గతంలో ఫుట్‌బాల్‌ జాతీయ జట్టు క్రీడాకారిణి మారియమ్మాళ్‌ మోకాలికి అరుదైన శస్త్రచికిత్స చేసి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు చెన్నై ప్రభుత్వ వైద్యులు.

Updated : 25 Nov 2022 09:53 IST

ఈనాడు, చెన్నై: గతంలో ఫుట్‌బాల్‌ జాతీయ జట్టు క్రీడాకారిణి మారియమ్మాళ్‌ మోకాలికి అరుదైన శస్త్రచికిత్స చేసి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు చెన్నై ప్రభుత్వ వైద్యులు. ఇప్పుడు మరో క్రీడాకారిణికి అదే తరహా వైద్యం చేసేక్రమంలో ఆమె ప్రాణాలు తీశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దేశం తరఫున ఆడాల్సిన బాలిక విగతజీవిగా మారడంతో తమిళనాడులో దుమారం చెలరేగుతోంది.

చెన్నై వ్యాసర్పాడికి చెందిన క్రీడాకారిణి ఆర్‌.ప్రియ(17) కుడికాలికి గాయం కావడంతో పెరియార్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఆర్థ్రోస్కోపీ ద్వారా మోకాలిలోని అతిక్లిష్టమైన లిగమెంట్‌ టేర్‌కు ఈనెల 7న వైద్యులు శస్త్రచికిత్స చేశారు. రక్త ప్రసరణ నియంత్రణకు తొడభాగంలో ఉంచిన టోర్నీక్వెట్‌ను 20 గంటలపాటు తొలగించకపోయేసరికి కుడికాలిలో రక్తం గడ్డకట్టింది. పరిస్థితి విషమించగా ప్రియను రాజీవ్‌గాంధీ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. ఆమెను ప్రాణాపాయం నుంచి తప్పించేందుకు 9న కాలు తొలగించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగు కాకపోవడంతో 14న మరో శస్త్రచికిత్స చేశారు. పరిస్థితి మరింత విషమించి అవయవాలన్నీ పనిచేయక మరుసటిరోజు ప్రియ చనిపోయారు. బాధితురాలి ఇంటికి వెళ్లిన సీఎం స్టాలిన్‌ కుటుంబసభ్యులను పరామర్శించి, రూ.10 లక్షలను పరిహారంగా అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని