క్షయ నివారణకు కృషి చేస్తా : దీపా మాలిక్‌

దేశంలో క్షయవ్యాధి నివారణకు చేపట్టిన ‘ని-క్షయ్‌ మిత్ర’ ప్రచారానికి మద్దతుగా నిలుస్తానని పారా ఒలింపిక్‌ క్రీడల్లో భారత్‌ తరఫున మహిళల్లో తొలి పతక విజేత దీపా మాలిక్‌ ప్రకటించారు.

Published : 27 Nov 2022 03:52 IST

‘ని-క్షయ్‌ మిత్ర’ అంబాసిడర్‌గా పారాలింపిక్‌ క్రీడాకారిణి

దిల్లీ: దేశంలో క్షయవ్యాధి నివారణకు చేపట్టిన ‘ని-క్షయ్‌ మిత్ర’ ప్రచారానికి మద్దతుగా నిలుస్తానని పారా ఒలింపిక్‌ క్రీడల్లో భారత్‌ తరఫున మహిళల్లో తొలి పతక విజేత దీపా మాలిక్‌ ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించిన ఈ కార్యక్రమ జాతీయ అంబాసిడర్‌గా దీపా మాలిక్‌ను నియమించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. ఈ కార్యక్రమం పోషకాహారం, అదనపు రోగనిర్ధరణ, వృత్తిపరమైన మద్దతు.. ఇలా మూడు దశల్లో క్షయవ్యాధి పీడితులకు సాయం అందిస్తుంది. దిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఏర్పాటుచేసిన 41వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో క్షయ చైతన్య ప్రచారం నిర్వహించారు. ఇందులో ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత దీపా మాలిక్‌ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టిన ‘టీబీ ముక్త్‌ భారత్‌’ సందేశం వ్యాప్తికి అంకితభావంతో కృషి చేస్తానన్నారు. క్షయవ్యాధిని తాను జయించిన విధానాన్ని ఆమె వివరించారు. ఈ సందర్భంగా భారత పారాలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు అయిదుగురు క్షయ రోగులను దత్తత తీసుకొంటున్నట్లు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని