QR Code: కోర్టులో టిప్పుల కోసం యూనిఫాంపై క్యూఆర్‌ కోడ్‌

యూనిఫాంపైనే పేటీఎం క్యూఆర్‌ కోడ్‌ అమర్చుకుని మరీ న్యాయవాదుల నుంచి టిప్పులు స్వీకరిస్తున్న ఓ జమేదారు(బిళ్ల బంట్రోతు)ను అధికారులు సస్పెండ్‌ చేశారు.

Updated : 02 Dec 2022 09:20 IST

ప్రయాగ్‌రాజ్‌: యూనిఫాంపైనే పేటీఎం క్యూఆర్‌ కోడ్‌ అమర్చుకుని మరీ న్యాయవాదుల నుంచి టిప్పులు స్వీకరిస్తున్న ఓ జమేదారు(బిళ్ల బంట్రోతు)ను అధికారులు సస్పెండ్‌ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌ హైకోర్టులో రాజేంద్ర కుమార్‌ అనే వ్యక్తి ఓ జడ్జికి బిళ్ల బంట్రోతుగా పని చేస్తున్నారు. కోర్టుకు వచ్చే న్యాయవాదులను టిప్పు ఇవ్వాలని అడిగేవాడు. నగదు లేదని చెప్పేవారి నుంచి ఎలాగైనా డబ్బు రాబట్టేందుకు యూనిఫాంపైన పేటీఎం క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని ధరించి నిర్భయంగా కోర్టులో సంచరించేవాడు.

అయితే ఇటీవల యూనిఫాంపైన పేటీఎం క్యూఆర్‌ కోడ్‌ ఉన్న ఫొటో ఒకటి వైరల్‌ అయింది. అందులో రాజేంద్ర కుమార్‌ ముఖం కనిపించనప్పటికీ ఈ విషయం చర్చనీయాంశం అయింది. రాజేంద్ర కుమార్‌ గురించి తెలిసిన న్యాయమూర్తి జస్టిస్‌ అజిత్‌ కుమార్‌ ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయగా ఆయన ఈ విషయంపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. దర్యాప్తులో రాజేంద్ర కుమార్‌ బాగోతం బయటపడటంతో అధికారులు అతణ్ని సస్పెండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని