రూ.కోటి విలువైన నగలను క్యాబ్‌లో మర్చిపోతే..!

ఓ ప్రవాస భారతీయుడు రూ.కోటి విలువ చేసే నగలను ఉబర్‌ క్యాబ్‌లో మర్చిపోయారు.

Published : 02 Dec 2022 04:33 IST

నోయిడా: ఓ ప్రవాస భారతీయుడు రూ.కోటి విలువ చేసే నగలను ఉబర్‌ క్యాబ్‌లో మర్చిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నాలుగు గంటలపాటు శ్రమించి నగలను స్వాధీనం చేసుకొని అతడికి అందజేశారు. ఈ ఘటన గ్రేటర్‌ నోయిడాలో జరిగింది. నిఖిలేశ్‌కుమార్‌ సిన్హా అనే వ్యక్తి గురువారం గౌర్‌ పట్టణ ప్రాంతంలోని హోటల్‌కు క్యాబ్‌లో చేరుకున్న తర్వాత లగేజీలో ఓ బ్యాగ్‌ కనిపించడం లేదని గుర్తించారు. అందులోనే నగలు ఉన్నాయి. క్యాబ్‌లోనే మర్చిపోయి ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన నుంచి క్యాబ్‌ డ్రైవరు ఫోన్‌ నంబరును తీసుకున్న పోలీసులు గురుగ్రామ్‌లోని ఉబర్‌ కార్యాలయం సాయంతో క్యాబ్‌ లైవ్‌ లొకేషన్‌ను ట్రాక్‌ చేసి ఘాజియాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి కారు డిక్కీలో బ్యాగ్‌ ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అయితే,  కారులో బ్యాగ్‌ ఉన్నట్లు తనకు తెలియదని క్యాబ్‌ డ్రైవర్‌ పోలీసులకు తెలిపాడు. బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు తాళం తెరవకుండానే నిఖిలేశ్‌ కుమార్‌ కుటుంబసభ్యులకు దాన్ని అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని