జాతీయ బీసీ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా హన్స్‌రాజ్‌

జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా మహారాష్ట్రకు చెందిన భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం అహిర్‌ (68) శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

Published : 03 Dec 2022 04:03 IST

ఈనాడు, దిల్లీ: జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా మహారాష్ట్రకు చెందిన భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం అహిర్‌ (68) శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా హన్స్‌రాజ్‌ మాట్లాడుతూ.. సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌ అన్న ప్రధాని మోదీ నినాదాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు.  మహారాష్ట్రలోని చంద్రాపుర్‌ లోక్‌సభ స్థానం నుంచి 1996లో ఒకసారి, మళ్లీ 2004 నుంచి 2019 వరకు ఈయన ప్రాతినిధ్యం వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని