ICMR: ఐసీఎంఆర్‌ కొత్త కొవిడ్‌ కిట్‌.. 30 నిమిషాల్లో ఫలితాలు

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయంతో విదేశాల నుంచి వస్తోన్న ప్రయాణికులకు అధికారులు కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, ఆర్టీపీసీఆర్‌ పరీక్షల చేయడానికి, ఫలితాలు రావడానికి చాలా సమయం పడుతోంది. దీంతో విమానాశ్రయాల్లో రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ ఫలితాలు తొందరగా

Published : 08 Dec 2021 13:55 IST

దిల్లీ: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయంతో విదేశాల నుంచి వస్తోన్న ప్రయాణికులకు అధికారులు కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, ఆర్టీపీసీఆర్‌ పరీక్షల చేయడానికి, ఫలితాలు రావడానికి చాలా సమయం పడుతోంది. దీంతో విమానాశ్రయాల్లో రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ ఫలితాలు త్వరగా వచ్చేలా ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ విభాగం ఆర్‌టీ-లాంప్‌(RT-LAMP)కొవిడ్‌ కిట్‌ను ఆవిష్కరించింది. నిపుణుల అవసరం లేకుండా సులభంగా ఈ కిట్‌తో కరోనా పరీక్షలు నిర్వహించవచ్చని.. ఫలితాలు అరగంటలోపే వస్తాయని ఐసీఎంఆర్‌ పేర్కొంది.

ఆర్‌టీ-లాంప్‌ వందశాతం సమర్థంగా పనిచేస్తుందని.. కచ్చితమైన ఫలితాలను ఇస్తుందని ఐసీఎంఆర్‌ ప్రతినిధులు వెల్లడించారు. ఇతర కొవిడ్‌ పరీక్షల కంటే ఈ ఆర్‌టీ-లాంప్‌ పరీక్షకు 40శాతం తక్కువ ఖర్చవుతుందని తెలిపారు. వీటిని భారీ సంఖ్యలో ఉత్పత్తి చేయడం కోసం దిల్లీ, చెన్నైలోని పలు కంపెనీలకు నమూనాలు పంపించామని, మరో రెండు వారాల్లో ఈ కొత్త కొవిడ్‌ కిట్‌ అందుబాటులోకి వస్తుందని వివరించారు. ఇవి విమానాశ్రయాలతోపాటు, ఓడరేవులు, రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌లలో ప్రయాణికులకు పరీక్షలు చేసేందుకు ఉపయుక్తంగా ఉంటాయని ఐసీఎంఆర్‌ తెలిపింది. 

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని