Afghanistan: అఫ్గాన్‌లో ఉన్న భారతీయులు.. ప్రత్యేక విమానంలో వచ్చేయండి..!

అఫ్గాన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. తాలిబాన్లకు, దేశ బలగాలకు మధ్య జరుగుతున్న హింసాత్మక పోరులో సాధారణ పౌరులూ బలవుతున్నారు. తాజాగా బాల్ఖ్‌ ప్రావీన్స్‌లోని మజార్‌- ఏ- శరీఫ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు తాలిబాన్లు ప్రకటించడంతో

Updated : 10 Aug 2021 15:20 IST

కేంద్ర ప్రభుత్వం సూచన

కాబూల్‌: అఫ్గాన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. తాలిబాన్లకు, దేశ బలగాలకు మధ్య జరుగుతున్న హింసాత్మక పోరులో సాధారణ పౌరులూ బలవుతున్నారు. తాజాగా బాల్ఖ్‌ ప్రావీన్స్‌లోని మజార్‌- ఏ- షరీఫ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు తాలిబాన్లు ప్రకటించడంతో భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. ఆ ప్రాంతం, పరిసరాల్లో ఉన్న భారతీయులను వెంటనే స్వదేశానికి వెళ్లిపోవాలని సూచించింది. మంగళవారం సాయంత్రం ప్రత్యేక విమానం అందుబాటులో ఉంచినట్లు చెప్పింది. రాయబార కార్యాలయంలోని సిబ్బందీ చేరుకునే అవకాశం ఉంది. మజార్‌- ఏ- షరీఫ్‌ అఫ్గాన్‌లోని నాలుగో పెద్ద నగరం. అమెరికా తన దళాలను ఇక్కడి నుంచి ఉపసంహరిస్తున్న దరిమిలా.. తాలిబాన్లకు, దేశ సైన్యానికి మధ్య అక్కడ యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని