Updated : 10 Jun 2021 12:41 IST

America:8 కోట్ల డోసుల్లో భారత్‌కు వాటా..

వాషింగ్టన్‌: కొవాక్స్‌ కార్యక్రమం ద్వారా అమెరికా ప్రపంచ దేశాలకు ఎనిమిది కోట్ల కరోనా డోసులను అందించనుంది. దీనిలో భాగంగా భారత్‌కు కూడా టీకాలు రానున్నాయి. ఈ విషయాన్ని ఆ దేశ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారి వెల్లడించారు. ‘టీకా డోసులు భారత్‌కు ఎప్పుడు చేరుకుంటాయనే అంశంపై కచ్చితమైన వివరాలు లేవు. అయితే, ఎనిమిది కోట్ల డోసుల్లో భారత్‌ తన వాటాను అందుకోనుంది. ఈ మహమ్మారి కారణంగా భారత్ ఎంతగా నష్టపోయిందో మనమంతా చూశాం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మా భాగస్వాములతో కలిసిపని చేసే విషయంలో నిబద్ధతను ప్రదర్శించాం’ అని స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి నెడ్‌ప్రైస్‌ మీడియాకు వెల్లడించారు.  

కొద్ది వారాల్లో ప్రపంచ దేశాలకు ఎనిమిది కోట్ల డోసులు అందించనున్నట్లు గతంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. దానిలో భాగంగా ఈ కొవాక్స్ కార్యక్రమానికి ముందుగా తమ నిల్వల నుంచి 1.9కోట్ల డోసులను కేటాయించనున్నట్లు జూన్‌ 2న ప్రకటించారు. ఇక కరోనాపై పోరాటంలో అండగా ఉంటామని భారత్‌కు అగ్రరాజ్యం పలుమార్లు హామీ ఇచ్చింది. దానిలో భాగంగా అమెరికా ప్రభుత్వం మనదేశానికి ఇప్పటికే 100 మిలియన్ల డాలర్ల సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన కార్యక్రమాలను బైడెన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి తెలిపారు. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని